|
|
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనపై చేస్తున్న ఆరోపనలు నిజం కావని కావాలంటే నారా చంద్రబాబునాయుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ సన్నివేశం చూసినవారు చెప్తే బాగుంటుందని, తాను చెప్పడం బాగుండదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అక్కడ వివిధ పార్టీలకు చెందిన 15 మంది నాయకులున్నారని, వారిలో ఎవరినైనా అడగవచ్చునని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను చెప్పడం కన్నా, అక్కడున్నవారిని అడిగితే బాగుంటుందని, వారిని అడగండి అని ఆయన అన్నారు. రోశయ్యగారు ఉన్నారు, ఆయనను అడగండి అని ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఆర్థిక మంత్రి కె. రోశయ్య వైపు చూపించారు. దాంతో రోశయ్య జరిగిన వ్యవహారాన్ని తనదైన శైలిలో వివరిస్తూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
|
|