|
|
|
పాకిస్తాన్ తో జరుగనున్న మొదటి వన్డే కోసం 'టీమ్ ఇండియా' జట్టు గౌహతికి చేరుకుంది. రెండు రోజుల ప్రాక్టీస్ అనంతరం ఆదివారం ఉదయం కోల్ కతా నుంచి గౌహతికి భారత జట్టుతో పాటు.. సహాయక సిబ్బంది గౌహతికి చేరుకున్నారు. కోల్‌కతాలో బసచేసిన నక్షత్ర హోటల్ నుంచి విమానశ్రయం వరకు గట్టి భద్రతను కల్పించారు. సోమవారం నుంచి ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ గౌహతిలో జరుగనున్న విషయం తెల్సిందే. గౌహతికి చేరుకున్న జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్, సౌరవ్ గంగూలీ, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, పఠాన్, ప్రవీణ్ కుమార్, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, మురళీ కార్తీక్ లతో పాటు.. టీమ్ మేనేజర్ లాల్ చంద్ర రాజ్‌పుట్, బౌలిగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్, ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్‌లు ఉన్నారు.
|
|