మెక్సికో లో వరద భీభత్సం-12 లక్షల మంది నిరాశ్రయులు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

మెక్సికో సింధుశాఖలో ఉన్న తీర ప్రాంత టబాస్కో రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న కారణంగా లక్షలాది మంది ప్రజలు భారీగా నష్టపోయారు. టబాస్కో రాజధాని నగరం లివ్వాహెర్మోసాలో 12 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నట్లు మెక్సికో అధికారులు చెప్పారు. గత 50 ఏళ్లలో ఈ స్థాయిలో టబాస్కోలో వరదలు సంభవించడం ఇదే తొలిసారి. శుక్రవారం మెక్సికో అధికారులు టబాస్కో రాజధాని నగరాన్ని దాదాపుగా ఖాళీ చేయించారు. దాదాపుగా 70 శాతం రాష్ట్రం, 80 శాతం రాష్ట్ర రాజధాని ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. వరదముంపును తప్పించుకునేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.