కరుణ పై విరుచుకుపడిన జయ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  ఎల్టీటీఈ రాజకీయ విభాగం నేత తమిళ్ సెల్వన్ మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సంతాపం ప్రకటించడంపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ధ్వజమెత్తారు. నిషేధిక ఎల్టీటీఈ సంస్థకు మద్దతు పలకడం ద్వారా ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. చెన్నైలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ శ్రీలంక వాయుసేన కాల్పుల్లో మరణించిన తమిళ్ సెల్వన్ ను ప్రశంసించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజీవ్ గాంధి హత్య కేసులో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ నేరస్తుడిగా ఉన్న తరుణంలో ఆ సంస్థకు చెందిన సెల్వన్ ను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నించారు. ఎల్టీటీఈతో కరుణానిధికి సంబంధాలు ఉందని, ఆ సంస్థకు ఆయన సాయం చేస్తున్నారన్న విషయం ఈ చర్య ద్వారా బయటపడిందని తెలిపారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగిన డీపీఐ కార్యకర్త ఖైదుపై కరుణానిధి మాట్లాడకపోవడం కూడా ఆయన ఎల్టీటీఈకి సాయం చేస్తున్నారన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు ఉందని చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.