ప్రజా సమస్యలపై గళం విప్పుతా-ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

'శాసన మండలి సభ్యత్వం పదవి అని నేను ఏనాడు అనుకోలేదు. హోదా అని అనుకోలేదు. ఈ సభ్యత్వం ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పని చేస్తాను' అని పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. శాసన మండలి సభ్యునిగా అవకాశం ఉన్న రెండు సంవత్సరాలు ఈ వేదికపై ప్రజాసమస్యలపై గళం విప్పుతా,సమర్థంగా ప్రజాసమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తానంటూ ఆయన అన్నారు. నిజాయితీగా ఒక్క పైసా ఖర్చు చేయకుండా గెలిచాం, ఉన్నంతవరకు నిజాయితీగా పని చేస్తామన్నారు. ఆ తరువాత కూడా గతంలో మాదిరిగానే వివిధ వేదికలపై ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో ఎప్పుడూ పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.