పేదలను ఆదుకుంటాం : బ్రాహ్మణసంఘం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

             నిరు పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందిస్తామని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వక్కలంక శ్రీనివాస రావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనికోసం పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ఈ సంఘాన్ని సిద్దేశ్వరి పీఠాధిపతులు శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకోసం వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు, వేద సంస్కృత పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తెల్లకార్డులు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, ఉచిత వివాహాలు జరిపిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు తమను 9948377463, 9848312277, 9959999804 నెంబర్లలో ఫోన్ ద్వారా తమను సంప్రదించవచ్చన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.