|
|
|
రాక్ సంగీతపు హోరులో తడిసిముద్దయి పోవాలని ఉర్రూతలూగే సంగీత ప్రియులకు శుక్రవారం సాయంత్రం ఓ వినూత్న అనుభూతిని మిగిల్చింది. పాశ్చాత్య సంగీత తరంగంలో ఆడిపాడి అలిసిపోయే నగర యువత ఆరుగంటల పాటు ఏకధాటిగా బేగంపేట ప్యాలెస్ లో జరిగిన సంగీత కార్యక్రమాన్ని పరవశించి పోతూ ఆస్వాదించారు. ఎయిర్ టెల్ సంస్థ నిర్వహించిన ఈ లైవ్ మ్యూజిక్ షో ఆరుగంటల పాటు జరిగింది. నగరానికి చెందిన కాలేజ్ రాక్ బ్యాండ్ లు స్ట్రీట్ లెథల్, స్క్రిప్ట్, డిలే 456, స్టిఫ్‌నెక్ సిండ్రోమ్, వైట్ నాయిస్, పాష్, కాషన్, డ్రిఫ్ట్ బ్యాండ్ లు ఈ షోలో పాల్గొన్నాయి. తమకు బాగా నచ్చిన బాయ్‌జోన్ లాంటి వారి పాటలతో పాటు తామే స్వయంగా సంగీతాన్ని నెరిపిన పాటలను కూడా ఆయా బ్యాండ్ లు ఈ షోలో పాడి ఆకట్టుకున్నాయి.
|
|