ముషరఫ్ నిజస్వరూపం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడం ప్రజల ముందు ఆ దేశ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. పాక్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు భారత్ కృషి చేయాలని బీజేపీ కోరింది. ఆయన గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ తప్పులు చేస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో చేసిన తప్పదాల నుంచి ఆయనేమీ నేర్చుకోలేదనడానికి కూడా ఇది నిరదర్శనమన్నారు. ఎమర్జెన్సీ విధించి ముషారఫ్ మళ్లీ ఓ ఘోర తప్పదాన్ని చేశారని, ఇది ఈ మిలటరీ పాలకుని నిజస్వరూపాన్ని బయటపెట్టిందని పేర్కొన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.