|
|
|
మాజీ క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ సైనికులు గృహనిర్భంధంలో ఉంచారు. ఆ దేశ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీని విధించడాన్ని ఇమ్రాన్ తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా.. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వెళ్లి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను ఆదివారం తెల్లవారుజాము నుంచి గృహ నిర్భంధంలో ఉంచారు. అలాగే.. ప్రతిపక్ష నేతలు మునీర్ ఏ మాలిక్, అహసన్‌లను అరెస్టు చేశారు. గృహ నిర్భంధంలో ఉన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు తలెత్తడానికి ముషారఫే ప్రధానకారణమని ఆరోపించారు. ఈ సమస్యలన్నీ ఎమర్జెన్సీతో పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|