|
|
|
వరికి కనీస మద్దతు ధర రూ.1000 ఇవ్వాలంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్నరీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా రైతులు ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి వైఎస్ వేషధారణలతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ వేషధారణతో వారు ఎడ్ల బండి ఎక్కగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పీతన సుజాత తదితరులు జడ్పీ వారిని తమ సమావేశమందిరం వరకు బండిని లాగారు. వరికి మద్దతు ధర లభించే వరకు తమ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు. ఈ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
|
|