సుప్రీం అనుమతి: మరలా సినిమాల్లోకి మౌనిక
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

న్యూఢిల్లీ: నకిలీ పాసుపోర్టు కేసులో నిందితురాలైన మోనికా బేడీకి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని, అందుకు తాను దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని అంటూ అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మోనికా బేడీ పిటిషన్ దాఖలు చేసింది. అందుకు మోనికా బేడీకి అవకాశం కల్పిస్తూ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెకు తన ఇంటినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి సినీ నటి మోనికా బేడీకి సుప్రీంకోర్టు అనుమతి కల్పించింది.సుప్రీంకోర్టు అనుమతితో తెలుగు సినిమాలో నటించేందుకు అవకాశం ఏర్పడింది. మోనికా బేడీ సరిపోయే కథను రూపొందించి సినిమా తీసేందుకు ఇప్పటికే ఒక తెలుగు దర్శకుడు సిద్ధంగా ఉన్నాడు. తాను రూపొందించుకున్న కథలోని పాత్రకు మోనికా బేడి సరిగ్గా అతుకుతుందని అతను అంటున్నాడు. ఆమె కోసమే ఆ కథను తయారు చేశానని కూడా చెప్పుకుంటున్నాడు. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని, తెలుగు సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయని ఆమె జైలు నుంచి విడుదలైన సందర్భంలో చెప్పింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.