|
|
ప్రకృతి వైపరీత్యాలపై జరిగే అంతర్జాతీయ సదస్సు భారత్ లో జరుగనున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే చర్యలను ఈ అంతర్జాతీయ సదస్సులో సమీక్ష జరుపుతారు. దీనిలో సుమారు 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆసియా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటి కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రకృతీ వైపరీత్యాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అమలు చేయాల్సిన విధానాలు, కార్యక్రమాలపై చర్చించేందుకు జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సును దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
|
|