|
|
|
ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీకి షరతులతో కూడిన మద్దతును మాత్రమే ఇస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. భాజపా నేత యడ్డియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత జాప్యం నెలకొననుంది. యడ్డియూరప్ప నేతృత్వంలో భాజపా-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఇరు పార్టీలు అంగీకరించిన విషయం తెల్సిందే. అయితే ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు సమర్పించకుండా జేడీఎస్ కాలయాపన చేస్తోంది. అంతేకాకుండా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. కొన్ని షరతులకు అంగీకరించక తప్పదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతూ.. భాజపాకు మద్దతు ఇవ్వాలంటే కొన్ని షరతులకు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. మైనార్టీలు, దళితులకు రక్షణ లేకుండా పోతుందని, అందువల్ల వారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాలని కోరారు.
|
|