|
పాకిస్థాన్ పరిస్థితిపై మాజీ ప్రధాని నవాజ్ షరీప్ మాట్లాడుతూ దేశం ప్రస్తుతం చీకట్లోకి వెళుతుందన్నారు.దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కదిలివస్తే ముషారఫ్ ఆటలను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ పోరాటం జరుపుతానని బెనజీర్ భుట్టో హెచ్చరించారు. దేశాధ్యక్షుడు ముషారఫ్ తిరిగి ఆ పదవికి ఎన్నికయ్యే దానిపై సుప్రీం కోర్టు వ్యతిరేకంగా తీర్పు నిచ్చినందువల్లే ఆ పనికి ఈ పనికి ఒడిగట్టారని దుయ్యబట్టారు. కరాచీకి పయనమైన సందర్భంగా దుబాయ్‌లో బెనజీర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారటంతో దుబాయ్ నుంచి కరాచీకి బెనజీర్ భుట్టో శనివారం రాత్రి పయనమయ్యారు. స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత ముషారఫ్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా బెనజీర్ నేరుగా కరాచీలోని ఆమె నివాసమైన బిల్వాల్ హౌస్‌కు పయనమయ్యారు.
|