|
|
 |
నివాసేతర భవనాలపై ఆస్తిపన్ను పెంపు, భూ బదలాయింపు అంశాలపై విశాఖ పట్నం లో జరిగిన కౌన్సిల్ సమావేశం లో సోమవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.ఈ రెండింటనీ వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు.ప్రభుత్వం పెంచిన పన్నులను వ్యతిరేఖిస్తూ తెలుగుదేశం, సిపిఎం ,సిపిఐ నిరసన వ్యక్తం చేయగా, కొద్దిగానైనా పన్నులు పెంచకుంటే నగర అభివృద్ధి నిలిచిపోతుందని కాంగ్రెస్ సభ్యులు అనడంతో వాగ్వాదం ప్రారంభమైంది. ఆస్తి పన్నుకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు నగర వాసులకు జారీ చేసిన స్పెషల్ డిమాండ్ నోటీసులు వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం జారీచేసిన జి.వో ను అనుసరించే నోటీసులు జారీచేశామని అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. మూకుమ్మడిగా పోడియం వైపు దూసుకుపోయి మేయర్ ను నిలదీశారు. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాలని అధికారపక్షం ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
|
|