|
|
 |
నెల్లూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు,వాయుగుండం జత కలసి విజృంభిస్తున్నాయి.దీని కారణంగా నెల్లూరు జిల్లా వరద ద్రిగ్భందనంలో చిక్కుకుపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ళపైకి చేరుకుని సహాయం కోసం అర్దిస్తున్నారు. రైలు, రోడ్డు మార్గాలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్ధంబించిపోయింది. పలు రిజర్వాయర్లు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఐదవ టౌన్ పరిధిలోని పలు కాలనీలు మునిగి పోవడంతో ప్రజలు ఇళ్ళపైకి చేరుకుని సహాయం కోసం అర్దిస్తున్నారు. గూడూరు-మణుగూరు మధ్యగల రైల్వే ట్రాకు కింద కిలోమీటర్ల మేర మట్టి కొట్టుకుపోవడంతో రైలు సర్వీసులను రద్దు చేశారు. దాదాపు 10 రైళ్ళను రద్దు చేయగా, మరో 15 రైళ్ళు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
|
|