|
పేదలకు చెందాల్సిన భూములను సత్వరమే వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం నిరాహార దీక్షను చేపట్టారు. . హైదరాబాద్‌లో శుక్రవారం నిరాహార దీక్షను చేపట్టిన సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అన్యాక్రాంతమైన భూములను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్యాక్రాంతమైన వందల ఎకరాల భూములను పేదలకు పంచేవరకు తాను నిష్క్రమించేది లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూకబ్జా వ్యవహారాలకు చరమగీతం పాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో కొన్ని వందల కోట్లు విలువ చేసే భూములు ఆక్రమణకు గురౌతున్నాయని ఆయన పేర్కొన్నారు.
|