|
|
కాంట్రాక్టు గ్రామ కార్యదర్శుల మాదిరిగానే పార్ట్‌టైం గ్రామ రెవెన్యూ అధికారులుగా పని చేస్తున్నఉద్యోగుల వేతనాన్ని కూడా రూ. 4,900కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 2,710 మంది పార్ట్‌టైం గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేతన పెంపుకు సంబంధించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటివరకు వీరికి నెలకు రూ.1950 వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. వెతన పెంపు నిర్ణయం వల్ల ఖజానాపై ఏడాదికి రూ.9.59 కోట్ల మేర అదనపుభారం పడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే తమ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించి ఆరు నెలలవుతున్నా ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదని కాంట్రాక్టు గ్రామ కార్యదర్శుల సంఘం విమర్శించింది. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన వెంటనే పెంపు నిర్ణయాన్ని అమలు చేస్తామని, బకాయిలు చెల్లిస్తామని రెవిన్యూశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
|
|