|
విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరికి మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోడ్‌షో నిర్వహిస్తున్నారు. పామర్రు మీదుగా సాగుతున్న ఈ రోడ్‌షోకు వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. మూడేళ్ళుగా వర్షాలు కురుస్తూ పంటలు పండుతున్నా ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం గుడివాడలో చంద్రబాబు బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. వరికి మద్దతు ధర కల్పించకపోతే ఉద్యమం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రైతులనుక్అలు పుకుని ఉద్యమాలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు. పనిలో పనిగా ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా తన రోడ్ షోలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగడుతున్నారు.
.
|