|
|
దుర్గాపూజ సందర్భంగా సెక్స్ వర్కర్లు తమ కళ్లను దానం చేస్తామని ప్రమాణం చేశారు. శివుడికి భక్త కన్నప్ప కన్ను బహూకరించిన పురాణగాథ స్ఫూర్తితో తమ కళ్లను దానం చేయాలని సెక్స్ వర్కర్లు నిర్ణయించారని దర్బార్ మహిళా సమన్వయ కమిటీ నాయకురాలు మహాశ్వేత ముఖర్జీ తెలిపారు. పీడనకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా ఆమె సెక్స్‌వర్కర్లను చైతన్య పరుస్తున్నారు. నేత్ర దానం ద్వారా మరో జీవితం లభిస్తుందన్న నమ్మకంతో కొందరు, చూపు లేని వాళ్ల బాధలుకు చలించి, మరి కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారు. 'మేము చనిపోయిన తర్వాత మా కళ్ల ద్వారా మరో వ్యక్తి చాలా కాలం ప్రపంచాన్ని చూడగలుగుతారు. వారి ద్వారా మేము జీవితాన్ని కొనసాగిస్తాము' అని సెక్స్ వర్కర్ మాలా సేన్ చెప్పారు.
|
|