|
|
 |
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది.మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం లో చెన్నైకి ఆగ్నేయంగా 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పాండిచ్ఛేరి-కావలి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో గుంటూరు, నెల్లూరు ,కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ సమయం లో సముద్రం చాలా అల్ల కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదమని సూచించింది.పలు చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
|
|