తలాక్ ≠ విడాకులు-ఢిల్లీ హైకోర్ట్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 కోపంలో తలాక్ చెప్పడాన్ని విడాకులుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ముస్లిం వివాహాలకు సంబంధించి కోపంతో తలాక్ చెప్పినా, దానిని సరైన రీతిలో భార్యకు తెలుపకపోయినా విడాకులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ తరహా విడాకులు ఇస్లాంలో కానీ, ఖురాన్‌లో కానీ మొహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాల్లో కానీ లేవని జస్టిస్ బీడీ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఈ తలాక్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ఇది మహిళల పాలిట శాపంగా మారిందన్నారు. అలాగే తిరిగి కలసి జీవించాలనుకునే పురుషులకు కూడా ఇది సమస్యలు సృష్టిస్తున్నాయన్నారు. తలాక్ చెప్పడం ద్వారా తన భర్తతో శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నారని ఓ మహిళ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.