|
|
 |
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.మొదట ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో తాళ్లపూడి మండలం చేరుకున్నారు.అక్కడ తాటిపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.అనంతరం కొవ్వాడ స్లూయిజ్ ను ప్రారంభించారు.ఆ తరువాత అన్నదేవరపేటలో బహిరంగసభలో పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో సీఎం తో పాటు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్పమొయిలీ,మంత్రులు జానారెడ్డి,మాగంటి బాబు,ఆనం రాంనారాయణ్ రెడ్డి,రఘువీరారెడ్డి,పొన్నాల లక్ష్మయ్య,బొత్స సత్యనారాయణ,జేసీ దివాకరరెడ్డి,గీతారెడ్డి,సబితా ఇంద్రారెడ్డి,జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,జిల్లా మంత్రి గొల్లపల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
|
|