|
|
 |
హైదరాబాద్ : నగరం శివార్లలో కబ్జాలకు గురైన సర్వే నెం.80 భూములను వెంటనే పేదలకు ఇవ్వాలనీ, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కబ్జాకు గురైన భూముల్లో అధిక శాతం రాయలసీమ ఫాక్షనిస్టుల చేతుల్లోనే ఉన్నాయనీ, ఈ ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నంలో వారి నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈభూముల్లో ఈ నెల 26 నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆమర నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
|
|