నాకు ప్రాణహాని ఉంది-జయలలిత
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
తనకు ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కోర్టును అశ్రయించనున్నట్టు అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బు«ధవారం ప్రకటించారు. తగిన రక్షణ కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిలకు ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించిందని ఆమె మీడియాతో అన్నారు. ఆంగతకుడొకరు మంగళవారం తన నివాసంలోకి చొరబడడాన్ని దుష్ట సంఘటనగా ఆమె అభివర్ణించారు. తనవద్దనున్న సమాచారం ప్రకారం నిన్న జరిగిన సంఘటనను తేలిగ్గా కొట్టి పారేయలేమని జయలలిత అన్నారు.