|
పాకిస్థాన్ తో త్వరలో జరుగనున్న వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచ్ లకు జట్టులోకి ఎంపిక కావడంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ విముఖత వ్యక్తం చేశాడు.జట్టు లో స్థానం కొల్పోవడం పై విలేకరులతో మాట్లాడేందుకు ద్రావిడ్ నిరాకరించాడు.ఢిల్లీ హాఫ్ మారథాన్ ను ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన ద్రావిడ్ తిరిగి వెళుతూ తామింకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని చెప్పాడు. సుమారు 20 వేల మంది పాల్గొన్న ఢిల్లీ హాఫ్ మారథాన్ కు ప్రధాన ఆకర్షణకు నిలిచిన ద్రావిడ్ మీడియాను తప్పించుకునేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు. మారథాన్ లో పాల్గొన్న రన్నర్లలో చాలా మంది ద్రావిడ్ ను చూసి ఆగిపోవడం విశేషం. అనంతరం రన్నర్లను మారథాన్ లో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.
|