|
|
 |
నవంబర్ 17న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం జరగనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, అణు ఒప్పందంపై కేంద్ర రాజకీయాల్లో నెలకొన్ని అనిశ్చితి తదితర అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చలు జరపే అవకాశాలున్నాయి. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ భవిష్యత్ నేతగా పరిచయం చేసేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశం న్యూఢిల్లీలోని తాల్కోత్రా స్టేడియంలో జరగనుంది. ఈ సమావేశానికి ముందురోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా సమావేశం కానున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన అణు ఒప్పందాన్ని ప్రభుత్వ కీలక భాగస్వాములైన లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ప్రధాని, సోనియా గాంధీ ఇది మంచి ఒప్పందమని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని చెబుతున్న విషయం మనకు తెలిసిందే.
|
|