రికార్డు స్థాయిలో దుర్గ ఆదాయం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
దేవీనవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గ ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.మంగళ,బుధవారాల్లో జరిగిన హుండీ లెక్కింపులో మొత్తం 1,26,43,543రూపాయల నగదు,715 గ్రాముల బంగారం,15.350కేజిల వెండి ఆదాయంగా లభించింది.గత ఏడాది 99 లక్షల ఆదాయం వచ్చింది.