|
|
 |
విజయనగరం లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పులివేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పైడితల్లి అమ్మవారిని పుసపాటి వంశీయులైన అశోక్ గజపతిరాజు దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అమ్మవారి సన్నిధికి వచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద నుంచి కోట వరకూ రధాన్ని మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ సారి ఉత్సవాలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారని అంచనా.
|
|