పేలుళ్లపై భారత్ ఖండన
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
న్యూఢిల్లీ : కరాచీ బాంబు పేలుళ్లను భారత్ తీవ్రంగా ఖండించింది. దీన్నొక దుస్సంఘటనగా అభివర్ణిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదుల చర్యల వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాల ప్రభుత్వాల చిత్తశుద్ది తో పని చేయాలని భారత్ సూచించింది.