|
|
 |
వరదలు ముంచెత్తిన ప్రాంతాల ప్రజలకు వెంటనే సాయం అందించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్.రాజశేఖరరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరద ముంపుకు గురవ్వడంతో వైఎస్ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు వైఎస్ రాష్ట్రంలోని పలు వరద తాకిడికి గురైన ప్రాంతాల వివరాలను తెలుసుకుంటున్నట్లు చెప్పాయి. అలాగే వరద భాదిత ప్రాంతాల వివరాలను సేకరించేందుకై ఇప్పటికే రెండు హెలికాఫ్టర్లు, 40 మంది సభ్యులు గల నేషనల్ 'డయాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' రంగంలోకి దిగినట్లు తెలిపాయి.అలాగే వీటితో పాటు 22 టీంలు ఇప్పటికే సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
|
|