|
|
 |
మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామ శివారు లో ఉన్న సిరీస్ కంపెనీలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిరీస్ క్రాప్స్ సైన్సెస్ లిమిటెడ్ అనే పేరుతో నడిచే ఈ పరిశ్రమలో ఉదయం 9.15 ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఐసో ప్రొటాన్స్ బ్లాక్ లో ఎలక్ట్రికల్ కేబుల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.10 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పీసీబీ అధికారి ఒకరు అంచనా వేశారు.ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది కార్మికులున్నారని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఉవ్వెత్తున పొగలు రావడంతో మంబాపూర్,గుమ్మడిదల గ్రామాల ప్రజలు ఇళ్లకు తాళాలువేసి పరుగులు పెట్టారు.ఈ రెండు గ్రామాలు కంపెనీకి కేవల ఒక కిలోమీటరు పరిధిలోనే ఉన్నాయి.అగ్ని మాపక సిబ్బంది,మరోవైపు హెటెరో, న్యూలాండ్, బీహెచ్ఈఎల్ పరిశ్రమల నుంచి ప్రమాదాలను నివారించే యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి చెలరేగిన మంటలను అదుపుచేశాయి.
|
|