|
|
 |
రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాలో ఈ నెల 11 న జరిగిన పేలుడు దర్యాప్తు జరుగుతోంది.ఈ దర్యాప్తు లో హైదరాబాద్ పై పలు అనుమానాలు బయటపడుతున్నాయి. అక్కడ పేలిన బాంబుల్ని హైదరాబాద్ లో తయారుచేసినట్లు ఇప్పటికే గుర్తించారు. అజ్మీర్ పేలుడు వెనుకా మక్కా మసీదులో పేలుడుకు పాల్పడిన హుజీ హస్తం ఉందని, బిలాలే సూత్రధారని కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అజ్మీర్ సమీపంలోని పుష్కర్‌లో తాజాగా ఒక అనుమానితుడి దగ్గర హైదరాబాద్ సిమ్‌కార్డు దొరికింది.ఇటీవల జరిగిన అజ్మీర్‌లో పేలుడుకు పాల్పడ్డారనే అనుమానంతో అక్కడి పోలీసులు విడుదల చేసిన ఊహాచిత్రాల్లో ఒకటి సీబీఐ విడుదల చేసిన మక్కా పేలుడు అనుమానితుడి ఊహాచిత్రంతో సరిపోలుతోంది.అజ్మీర్ దర్గాలో పేలిన బాంబు మే 18న హైదరాబాద్ మక్కామసీదులో పేలిన బాంబునే పోలి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దర్గా ప్రధాన ద్వారం దగ్గర స్వాధీనం చేసుకున్న బాంబుని విశ్లేషించినప్పుడు ఈ వివరాలు తెలిశాయని అన్నారు.
|
|