బంగాళాఖాతం లో అల్పపీడనం నెల్లూరు లో వర్షాలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య ఋతుపవనాల వల్ల నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తూ ప్రజా జీవనంను అతలాకుతలం చేస్తుంది.ఈ వర్షాలు గత 4 రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు వర్షపునీటితో పొంగిపొర్లుతూ పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.వరదనీరు రహదారులపై పొంగిపొర్లుతూ వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారింది. జిల్లాలోని అన్ని జలాశయాల్లో నీరు పూర్తిస్థాయికి చేరుకుంది. మరోవైపు అదనపు నీరు ఈ జలాశయాలకు చేరుతుంది. జిల్లావ్యాప్తంగా వివిధ పంటలు ముంపు బారిన పడ్డాయి.