|
|
 |
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం గోదావరి జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలానికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నదేవరపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ, మంత్రులు జానారెడ్డి, మాగంటి బాబు, పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, జేసీ దివాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ గురువారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
|
|