|
|
తమ డిమాండ్ల సాధనకు మద్ధతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అక్టోబర్ 30న సమ్మె చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా కోటి మంది ప్రభుత్వోద్యోగులు ఈ సమ్మెలో పాలొననున్నారని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వోద్యోగ సంఘాల సమ్మఖ్య సంస్థాగత కార్యరసృఇ దురైపాండ్యన్ తెలిపారు. పాండిచ్చేరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరో వేతన కమిషన్ నివేదిక వచ్చే వరకు ప్రభుత్వోద్యోగులకు రూ. వెయ్యి చొప్పున తాత్కాలిక పరిహారం అందించాలని కోరారు. 2006 జనవరి 1 నుంచి ఈ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు మద్ధతుగా దేశవ్యాప్తంగా బీ,సీ,డీ కేటగిరీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారని తెలిపారు. అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను పెంచాలని కూడా తాము చేస్తున్నామన్నారు.
|
|