|
|
 |
వరంగల్ జిల్లా జనగామలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రజా చైతన్య సదస్సులో కేసిఆర్ మాట్లాడుతూ.'మధ్యంతర ఎన్నికల ఊపులో రాష్ట్రం లో ప్రముఖ పార్టీలు పోటీ పడి మరీ తాము అధికారం లోకి వస్తే రూ.2 కిలో బియ్యం ఇస్తామని,ఉచిత విద్యుత్తు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మేము తెలంగాణా బిడ్డలం.ఇన్నాళ్లూ మోస పోయాం. ఇక మీదట ఇది జరనివ్వం. ఆంధ్రావాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి పూర్వం వలె మోసపోము.మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది' అని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు.ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ లు రెండూ తెలంగాణకు అన్యాయమే చేశాయని. రెండు పార్టీల జెండాలు వేరైనా తెలంగాణ విషయంలో మాత్రం ఒక్కటే అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే పార్టీల జెండాలు మోయకండి. తెలంగాణ జెండాలు పట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
|
|