|
|
 |
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ లో గురువారం రాత్రి ఆరు సంవత్సరాల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. భూపేంద్రసింగ్ అనే ఆరేళ్ళబాలుడి గొంతుకు స్కూలు బెల్టు బిగించి చంపడం స్థానికంగా సంచలనం రేపింది. గురువారం స్కూలుకు వెళ్ళిన భూపేంద్ర సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడం తో కంగారుపడిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలను వెదుకగా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద ఇసుకగుట్టలో శుక్రవారం శవమై కనిపించాడు.హత్య చేయబడిన బాలుని కుటుంబం రాజస్థాన్ నుండి నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చారు.అయితే బాలుడు అర్దనగ్నంగా పడిఉండడం చూస్తోంటే లైంగికంగా వేధించి, హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|