|
|
 |
అన్ని మతాలకు వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలిపింది. మూడు నెలల్లోగా వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ చట్టాలు తీసుకురావాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ మూడు నెలల గడువు తరువాత దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. చాలా రాష్ట్రాల్లో హిందువులకు మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడాన్ని గమనించిన సుప్రీంకోర్టు అన్ని వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం అన్ని మతాలవారికి వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
|
|