|
|
 |
శ్రీకాకుళం: ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులు గుంపు మరో నిండుప్రాణాన్ని బలితీసుకుంది. గత కొద్ది రోజులుగా ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సం గురించి తెలుసుకోవడానికి వెళ్లిన ఓ పత్రికా వెలేకరిని ఏనుగులు చంపేశాయి. ఈరోజు పత్రికా విలేకరులు, ప్రజలు కలిసి వీర ఘట్టం మండలం హుసేన్ పాడు గ్రామం సమీపంలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్లారు. లోయలోకి వెళ్లగానే పొదలమాటు నుంచి ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేయడంతో అందరూ తలోదిక్కుకు పరిగెత్తారు. ఓ పతికలో పనిచేస్తున్న విలేకరి నాగరాజు కన్పించకపిపోవడంతో ప్రజలు గాలింపు మొదలు పెట్టారు. తర్వాత కొద్ది సేపటికి నాగరాజు మృతదేహం పొలాల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. ఏనుగులు సృష్టిస్తున్న బిభత్సానికి ప్రజలకు కంటి మీద కునుకు కరవైంది.
|
|