సంకీర్ణ ప్రభుత్వం యూపీఏ కు చేతకాదు-అద్వానీ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడం యూపీఏకి చేతకాదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ విమర్శించారు. నాలుగు కీలక రంగాలలో విఫలమైన యూపీఏ ప్రభుత్వం సంకీర్ణ సర్కారు ఎలా ఉండరాదో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ముఖర్జీ రాసిన సంకల్ప అనే పుస్తకావిష్కరణ సభలో అద్వాని ప్రసంగించారు. ధాన్యం మద్దతు ధర, రక్షణ వ్యవస్థ, మైనారిటీలు, సంకీర్ణంలోని పార్టీలతో సమర్ధంగా వ్యవహరించడం లాంటి అంశాలలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అద్వానీ అన్నారు. అలాగే యూపీఏ సర్కారు పూర్తి పదవీకాలం 2009 వ సంవత్సరం వరకు నిలబడదని,అంతకు ముందుగానే ప్రభుత్వం పడిపోయి,ఎన్నికలకు సిద్దమౌతుందని ఆయన జోస్యం చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.