కత్తిపోట్లకు గురైన తమిళనాడు పీసీసీ చీఫ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

తమిళనాడు పీసీసీ చీఫ్ కృష్ణస్వామి అకస్మాత్తుగా జరిగిన ధాడిలో కత్తిపోట్లకు గురయ్యారు. రామనాధపురం జిల్లాలో పది మంది సభ్యుల ముఠా ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, ఆయన భుజం,ఛాతీ పై కత్తితో పొడిచారు. ఆయనతో పాటు ఆ కారులో ప్రయాణం చేసిన మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పసుంపొన్ గ్రామంలో జరిగిన ముత్తు రామలింగ దేవర్ శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తిరిగి అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో వెళుతుండగా ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న మరు క్షణం లో అక్కడకు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణస్వామిని పరమకుడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి తర్వాత మదురై అపోలో ఆస్పత్రికి తరలించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.