|
|
 |
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో రెండవ ఎస్సార్సీ ప్రాతిపదిక అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీ ప్రకటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ సంఘం నాయకులు వెంకటేష్, విజయ్, సదన్, శంకర్ ఆధ్వర్యంలో గురువారం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పిడమర్తి రవి, ఓయు ఇన్ చార్జి వేల్పుల కుమార్ మాట్లాడుతూ వీరప్ప మొయిలీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి అమలు చేస్తున్న విధానాలను ఇక్కడ కూడా వర్తింప జేస్తామంటూ పేర్కొన్నారని తెలిపారు. భావాలను దెబ్బతీసే ప్రయత్నాలు సాగించారని, కొత్తగా వచ్చిన మొయిలీ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారని అన్నారు.
|
|