|
|
 |
భారత్ అమెరికా అణు ఒప్పందంలో విఫలమైన నేపధ్యంలో రాజీనామా చేయాలనే బీజేపీ డిమాండ్‌ను ప్రధాని త్రొసిపుచ్చారు. గతంలో గుజరాత్ అల్లర్లు, కార్గిల్‌లో పాకిస్థాన్ దళాల చొరబాటు నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం విఫలం కావడాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరుగు ప్రయాణం సమయంలో విలేకరులతoోమాట్లాడుతూ భారత్ అమెరికా అణు ఒప్పందం విఫలమైనంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే నైతికహక్కు లేదనడం సరికాదన్నారు. బీజేపీ తనను బలహీన ప్రధానిగా పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అంతమాత్రాన తమ ప్రభుత్వాన్ని మివర్శించే హక్కు బీజేపీకి అసలు లేదన్నారు.
|
|