'బాబు'ది తప్పుడు సమాచారం-మెయిలీ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

తెలుగు దేశం పార్టీ ప్రధానాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ విరుచుకుపడ్డారు. రైతు సమస్యల పరిష్కారం కన్నా ఆ సమస్యలను రాజకీయం చేయాలన్నదే బాబు ప్రధానోద్దేశంగా కన్పిస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం బాబు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. రైతు సమస్యలపై ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితోనే ఈ విషయం మాట్లాడే వారని చెప్పారు. అంతేకాక యూఎన్‌పీఏ సమావేశం కోసం ఢిల్లీ వచ్చి, ప్రధానిని అపాయింట్ మెంట్ కోరడమేంటని ప్రశ్నించారు. అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.