|
|
 |
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థలపై నగర పాలక సంస్థ దాడులను కొనసాగిస్తూనే ఉంది. కొన్నాళ్లు దాడులకు తెరపిచ్చిన యంత్రాంగం సోమవారం బంజారాహిల్స్ రోడ్డు నెం.1లో పార్కింగ్ లేని 22 వాణిజ్య సంస్థలను మూసివేసినట్లు గ్రేటర్ అదనపు కమిషనర్ ధనుంజయ్ రెడ్డి తెలిపారు. మేబాజ్, మిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్, ఉడ్ ల్యాండ్ తదితర సంస్థలను జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. నిబంధనలు పాటించని 500 వ్యాపార సంస్థలు, హోటళ్లకు గ్రేటర్ తాఖీదులను పంపిన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటి వరకు 84 సంస్థలను సీజ్ చేసింది. పార్కింగ్ తదితర నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న వ్యాపారాలనే అనుమతించాలని, లేనివాటి కి ట్రేడ్ లైసెన్స్ లను జారీ చేయకూడదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు.
|
|