నవంబర్ లో డీఎస్సీ నియామకాలు: మంత్రి దామోదర్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

     నవంబర్ నెల రెండో వారం లో డీఎస్సీ నియామకాలను పూర్తి చేస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా వెల్లడించారు. ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన పనులు త్వరితగతిన సాగుతున్నాయన్నారు. ర్యాంకులు, పోస్టింగులు కేటాయింపులో ఎలాంటి తప్పొప్పులు దొర్లకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అందుకే కొంత జాప్యం జరుగుతోందని మంత్రి వివరించారు. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ పాఠశాలల నెలకొల్పన కోసం వచ్చే నెల ఒకటో తేదీన కొన్ని విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు మంత్రి దామోదర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా నాణ్యమైన, మెరుగైన విద్యా సౌకర్యాలు అందిచేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.