|
|
 |
కర్ణాటక లో భాజపా ఈ రెండు రోజులలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారతదేశం లో తొలి భాజపా ముఖ్యమంత్రిగా యడ్డియూరప్ప రికార్డు సృష్టించనున్నారు. భాజపాకు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పిన దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్), చీలక భయంతో ఎట్టకేలకు భాజపాకు తన మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ రెండు పార్టీల నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి మద్దతు లేఖలను సమర్పించారు. దీంతో భాజపా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి భాజపా నేత యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కాగా,'యడియూరప్ప' ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సూచన మేరకు 'యడ్డియూరప్ప'గా పేరు మార్చుకున్నారు.
|
|