|
|
 |
భారత్, అమెరికాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై యూఎన్‌పీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడుతో చర్చలేమీ జరపలేదని ఎన్సీపీ చీఫ్ పవార్ చెప్పారు.చంద్రబాబు నేతృత్వంలోని నేతల బృందంతో జరిగిన సమావేశంలో వరి మద్ధతు ధరపై మాత్రమే చర్చలు జరిపామని అణు ఒప్పంద వివాదంపై తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. మరే ఇతర అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని ఆయన తెలిపారు. అంతకుముందు అణు ఒప్పందంపై యూఎన్‌పీఏ నేతలు యూపీఏ భాగస్వాములతో, లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పవార్ ఖండించారు. తాను యూఎన్‌పీఏ నేతలతో అణు ఒప్పందంపై ఎటువంటి చర్చలు జరపలేదని వెల్లడించారు.
|
|