|
|
వడోదరా : గుజరాత్ లో బీజేపీ తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోబోమని ఎండీపే భాగస్వామి జేడియూ ప్రధాన కార్యదర్శి త్యాగి స్పష్టం చేశారు. రెండు విడతలుగా డిసెంబర్ లో జరుగనున్న ఎన్నికల్లోతమ పార్టీ తరపున 25 మంది అభ్యర్థులను బరిలో ఎంపనున్నట్టు తెలిపారు. వడోదరాలో వెలేకరులతో మాట్లాడిన ఆయన బీహార్‌లో సంకీర్ణ భాగస్వాములుగా జేడియూ, బీజేపీలు అధికారంలో ఉన్నప్పటికీ, గుజరాత్ లoోనరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో తాము ఎటువంటి పొత్తు కుదుర్చుకోబోమని పేర్కొన్నారు. గోధ్రా అల్లర్ల సందర్భంగా నియంతృత్వంలో కూడిన పాలనతో రాష్ట్రాన్ని హింసాత్మకంగా మోడి మార్చారని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేర్చించేందుకు తప్పుడు ఆరోపణలతో పార్టీ రాష్ట్ర చీఫ్ చోటుబాయ్ వాసవాపపి కేసు నమోదు చేయించారని ఆయన ధ్వజమెత్తారు.
|
|